Reliance Jio: డౌన్‌లోడ్ స్పీడ్‌లో రిలయెన్స్ జియో టాప్… స్పీడ్ ఎంతంటే– News18 Telugu

0
3


Reliance Jio: డౌన్‌లోడ్ స్పీడ్‌లో రిలయెన్స్ జియో టాప్… స్పీడ్ ఎంతంటే
(ప్రతీకాత్మక చిత్రం)

మీరు రిలయెన్స్ జియో యూజరా? మీ స్మార్ట్‌ఫోన్‌లో రిలయెన్స్ జియో సిమ్ కార్డ్ ఉందా? మీరు మీ ఇంటర్నెట్ అవసరాల కోసం జియో నెట్‌వర్క్ ఉపయోగిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. 4జీ డౌన్‌లోడ్ స్పీడ్ చార్ట్‌లో రిలయెన్స్ జియో టాప్‌లో నిలిచింది. అంటే 4జీ నెట్‌వర్క్ ద్వారా ఫైల్స్ డౌన్‌లోడ్ చేయడంలో రిలయెన్స్ జియో మిగతా నెట్వర్క్‌ల కన్నా చాలా స్పీడ్‌లో ఉందని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-TRAI తాజా లెక్కలు చెబుతున్నాయి. 2020 జనవరి లెక్కల ప్రకారం రిలయెన్స్ జియో డౌన్‌లోడ్ స్పీడ్ 20.9 మెగాబిట్ పర్ సెకండ్-mbps స్పీడ్ ఉండటం విశేషం. 2019 నవంబర్‌లో ఈ స్పీడ్ 27.2 ఎంబీపీఎస్ ఉంది. స్పీడ్ కాస్త తగ్గినా మిగతా నెట్వర్క్‌లకు అందనంత దూరంలో ఉంది రిలయెన్స్ జియో. టెలికామ్ రంగంలో రిలయెన్స్‌ జియోతో పోటీపడుతున్న భారతీ ఎయిర్‌టెల్ 4జీ డౌన్‌లోడ్ స్పీడ్ 7.9 ఎంబీపీఎస్ కాగా, ఆ తర్వాతి స్థానాల్లో వొడాఫోన్ 7.6 ఎంబీపీఎస్, ఐడియా 6.5 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఉన్నాయి.

Also READ:   సాంకేతిక అద్భుతం..చనిపోయిన బిడ్డను కలిసిన తల్లి..– News18 Telugu

ఇక 4జీ అప్‌లోడ్ స్పీడ్‌లో వొడాఫోన్ 6 ఎంబీపీఎస్‌తో టాప్‌లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఐడియా 5.6 ఎంబీపీఎస్, రిలయెన్స్ జియో 4.6 ఎంబీపీఎస్, ఎయిర్‌టెల్ 3.8 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఉన్నాయి. 4జీ యూజర్లకు అప్‌లోడ్ స్పీడ్ కన్నా డౌన్‌లోడ్ స్పీడ్ ముఖ్యం. యాప్స్ ఉపయోగించడానికి, వీడియోలు చూడటానికి, డౌన్‌లోడ్ చేయడానికి డౌన్‌లోడ్ స్పీడ్ ఎక్కువ ఉండాలని కోరుకుంటారు యూజర్లు. ఈ విషయంలో రిలయెన్స్ జియో ఇతర కంపెనీల కన్నా చాలా ముందు ఉండటం విశేషం. MySpeed అప్లికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి డేటాను సేకరించి సగటు స్పీడ్‌ను నిర్ణయిస్తుంది ట్రాయ్. వొడాఫోన్, ఐడియా రెండు కంపెనీలు కలిసిపోయినా ఈ రెండు కంపెనీల 4జీ స్పీడ్‌ను ట్రాయ్ వేర్వేరుగా లెక్కిస్తోంది.

Also READ:   5 UNIQUE SMARTPHONE GADGETS + PUBG MOBILE KEYBOARD ▶

ఇవి కూడా చదవండి:Jio Plans: జియోలో ఎక్కువ డేటా కావాలా? రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

ఇది చదవండి


Samsung Galaxy Z Flip: ఈ స్మార్ట్‌ఫోన్ మడతపెట్టొచ్చు… సాంసంగ్ నుంచి రెండో మోడల్ రిలీజ్

Aadhaar Card: మీ పిల్లలకు ఆధార్ కార్డు ఉందా? ఈ సేవలు ఉచితం

WhatsApp: మీ వాట్సప్ సేఫ్‌గా ఉండాలంటే ఈ సెట్టింగ్స్ మార్చండి



First published: February 14, 2020

Also READ:   After Pulwama Attack, Indian Air Force Projects Brute Force Near Pakistan Border



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here