సాహో మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | Saaho movie review and rating

0
157

Please View My Other Sites

సాహో కథ

రాయ్ ( జాకీ ష్రాఫ్), దేవరాజ్ (చంకీ పాండే) గ్యాంగ్‌స్టర్ గ్రూపుల మధ్య ఆధిపత్యం కొనసాగుతుంటుంది. ఆధిపత్య పోరులో రాయ్ అనూహ్యంగా ఓ యాక్సిడెంట్‌లో మరణిస్తాడు. రాయ్ స్థానంలో ఆయన కుమారుడు విశ్వక్ (అరుణ్ విజయ్) బాధ్యతలు చేపడుతాడు. ఆ క్రమంలో 2 లక్షల కోట్లు దోపిడి జరుగుతుంది. ఆ కేసును దర్యాప్తు చేయడానికి అశోక్ చక్రవర్తి (ప్రభాస్) ఆఫీసర్‌ వస్తాడు. అదే కేసును టేకప్ చేసిన అమృతా నాయర్ (శద్దా కపూర్)తో ప్రేమలో పడుతాడు. ఆ కేసును ఛేదించేందుకు అవసరమైన బ్లాక్ బాక్స్‌ను చేజిక్కించుకోనేందుకు ప్లాన్స్ వేస్తారు.

సాహోలో ట్విస్టులు

సాహోలో ట్విస్టులు

అశోక్ చక్రవర్తిగా అడుగు పెట్టిన ఆఫీసర్ సాహోగా ఎందుకు మారాడు? సాహో ముసుగులో బ్లాక్ బాక్స్‌ను చేజిక్కించుకొనేందుకు ఎందుకు ప్రయత్నించాడు. ఈ కథలో నీల్ నితిన్ ముఖేష్ పాత్ర ఏంటి? రాయ్ మరణం వెనుక కారణాలు ఏమిటి? బ్లాక్ బాక్స్ కోసం దేవరాజ్ ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ఈ కథలో అసలు దొంగ ఎవరు? అసలు పోలీసు ఎవరు? రాయ్ వారసుడిగా ఎవరు నిలిచారు? అమృత, సాహో ప్రేమకు ఎలాంటి ముగింపు దొరికింది? అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే సాహో కథ.

ఫస్టాఫ్ గురించి

ఫస్టాఫ్ గురించి

రెండు గ్యాంగ్‌స్టర్ గ్రూపుల మధ్య ఆధిపత్యం పోరాటంతో సాహో కథ మొదలవుతుంది. అయితే సాధారణ ప్రేక్షకుడికి కనీసం అర్ధం కాని విధంగా స్క్రీన్ ప్లే ఉండటంతో కన్‌ఫ్యూజన్ ఎక్కువగానే కనిపిస్తుంది. తొలి భాగంలో ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్రీన్ ప్లే మరింత గందరగోళం చేస్తుంది. ప్రభాస్ ఎంట్రీ తర్వాత కాస్త రిలీఫ్ కలిగినా.. శ్రద్దాకపూర్ మధ్య సీన్లు చాలా స్లోగా సాగడం మరింత విసుగు పుట్టిస్తుంది. అందుకు తగినట్టే పాటలు కూడా మరీ స్లో కావడంతో ప్రేక్షకుడిలో నీరసం పరుగులు పెడుతుంది. ఇక ఇంటర్వెల్‌కు 10 నిమిషాల ముందు కథనంలో వేగం పెరగడం, యాక్షన్ సీన్లు థ్రిల్లింగ్‌గా ఉండటంతో ప్రేక్షకుడు సీట్లకు హత్తుకుపోయేలా చేస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో కథలో సీరియస్‌నెస్ కనిపిస్తుంది.

సెకండాఫ్ గురించి

ఇక సెకండాఫ్‌లో కథలో అనేక ట్విస్టులు సినిమాపై ఆసక్తిని కలిగేలా చేస్తుంది. అలాగే సాహో కథ మొదలు కావడం, పలు పత్రాల మధ్య వేరియేషన్ కొత్తగా ఉండటం సినిమాపై మరింత ఇంట్రెస్ కలుగజేస్తుంది. ఇక క్లైమాక్స్‌కు ముందు వచ్చే సీన్లు మరింత ఉద్వేగంగా ఉంటాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ మధ్య వచ్చే యాక్షన్ సీన్లు ఓ మ్యాజిక్‌లా అనిపిస్తాయి. కథలో పస లేకపోవడంతో టెక్నికల్ బ్రిల్లియెన్స్‌పై దెబ్బ పడిందనే అభిప్రాయం కలుగుతుంది.

దర్శకుడి ప్రతిభ

దర్శకుడి ప్రతిభ

కథ లేకుండానే కసరత్తు చేస్తే ఎలా ఉంటుందనే విషయం సాహో చూస్తే తెలుస్తుంది. కేవలం టెక్నికల్ అంశాలపై ఆధారపడిన దర్శకుడు సుజిత్ కాస్త కథపై దృష్టిపెట్టి ఉంటే మరింత మంచి అవుట్‌పుట్ రావడానికి అవకాశం కలిగేది. తెలుగు ప్రేక్షకుడు ఓపికగా సినిమాలు చూసే పరిస్థితి ఇంకా రాలేదని దర్శకుడు గ్రహించలేకపోవడం ప్రధాన లోపం. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేద్దామనే ప్రయత్నం అసలుకే ఎసరు పెట్టేలా కనిపించింది. కాకపోతే సుజిత్ టేకింగ్, యాక్షన్ సీక్వెన్సులను డిజైన్ చేసిన తీరు చూస్తే.. నెక్ట్స్ లెవెల్ అనే ఫీలింగ్ కలుగుతుంది. జయపజయాలు పక్కన పడితే భారీ బడ్జెట్ చిత్రాలను సునాయసంగా హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉందని సాహోతో నిరూపించుకొన్నాడు. ప్రభాస్‌ను ఇండియన్ జేమ్స్‌బాండ్ అనే ఫీలింగ్‌ను కలిగించేలా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.

ప్రభాస్ ఫెర్ఫార్మెన్స్

ప్రభాస్ ఫెర్ఫార్మెన్స్

ప్రభాస్‌ సాహోగా, అశోక్ చక్రవర్తిగా రెండు రకాల వేరియేషన్ ఉన్న పాత్రల్లో కనిపిస్తాడు. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకొనే కుమారుడిగా, అలాగే గ్యాంగ్‌స్టర్ సమ్రాజ్యాన్ని చేజిక్కించుకునే వ్యక్తిగా తనదైన నటనను ప్రదర్శించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో ప్రభాస్ ఫెర్ఫార్మెన్స్ ఆకట్టుకునేలా ఉంది. ఇక క్లైమాక్స్‌లో ఎమోషనల్‌ కంటెంట్‌తో పాత్రలో ఒదిగిపోయాడు. ఇండియన్ స్క్రీన్‌పై సూపర్ హీరో ఇమేజ్‌ను చేజిక్కించుకున్నాడనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కథ, కథనాలు బలహీనమైనప్పటికీ, తన ప్రతిభతో సినిమాను నెలబెట్టాడు.

శ్రద్దాకపూర్

శ్రద్దాకపూర్

పోలీస్ ఆఫీసర్ అమతగా శ్రద్దాకపూర్ గ్లామర్‌తోనే కాదు.. యాక్షన్ పార్ట్‌తో కూడా కొత్తగా కనిపించింది. ఇప్పటి వరకు గ్లామర్ డాళ్‌గా కనిపించిన ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ కీలకమైన పాత్రలో మెరిసింది. భావోద్వేగాల మధ్య నిలిగే అమ్మాయిలా కూడా మెప్పించింది. ప్రభాస్‌తోపాటు సమానంగా బలమైన పాత్రను అవలీలగా పోషించడంలో తన వంతు కృషి చేసింది.

విజయ్ అరుణ్, నీల్ నితిన్ యాక్టింగ్

మాఫియా గ్రూఫ్ లీడర్‌గా అరుణ్ విజయ్ కీలకమైనదే. కథను మలుపుతిప్పే పాత్రలో అరుణ్ విజయ్ కనిపిస్తాడు. అలాగే అవకాశం దొరికిన ప్రతీసారి తన ముద్రను కనబరిచే ప్రయత్నం చేశాడు. ఇక నీల్ నితిన్ ముఖేష్ పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వెల్‌లో ఉండే ట్విస్టుతో నీల్ పాత్ర పాజిటివ్‌గా మారిపోతుంది. కథలో ప్రభాస్, శ్రద్దాకపూర్ పాత్రలే డామినేట్ చేయడంతో వీరిద్దరి ఫెర్ఫార్మెన్స్ చోటుదక్కలేదనే ఫీలింగ్ కలుగుతుంది.

ఇతర నటీనటులు గురించి

ఇతర నటీనటులు గురించి

రాయ్‌గా జాకీ ఫ్రాప్‌ అతిథి పాత్రకే పరిమితమయ్యాడు. ఇక దేవరాజ్‌గా చంకీ పాండే కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. హ్యాకర్‌గా పోలీసులకు టోకరా ఇచ్చే మురళీ శర్మ పాత్ర కూడా అంతంత మాత్రమే. వెన్నెల కిషోర్ పెద్దగా నవ్వించలేకపోయాడు. ఇక మందిరా బేడి పాత్ర కూడా గొప్పగా లేకపోయింది. సినిమాలో చాలా పాత్రలు ఉన్నప్పటికీ.. కొందర్ని చాలా కష్టంగా గుర్తుపట్టాల్సి వస్తుంది.

మ్యూజిక్.. ఆర్ట్ విభాగాల పనితీరు

మ్యూజిక్.. ఆర్ట్ విభాగాల పనితీరు

ఇక సినిమాకు అత్యంత పాజిటివ్ పాయింట్ జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. బ్యాడ్ బాయ్ ఒక్కటే సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ చెప్పవచ్చు. స్టోరి గ్రిప్పింగ్‌గా ఉంటే పాటల కూడా ఫీల్‌గుడ్‌గా మారే అవకాశం కలిగేది. ఇక ఈ సినిమాలో ఆర్ట్ విభాగం పనితీరు ఎక్సలెంట్. ఈ మధ్య కాలంలో ఇంత భారీగా, కన్విన్సింగ్ ఆర్ట్ విభాగాన్ని స్కోప్ ఉన్న దాఖలాలు కనిపించవు. సినిమాను రిచ్‌గా చూపించడంలో ఆర్ట్ విభాగం సక్సెస్ అయింది.

సినిమాటోగ్రఫి గురించి

సినిమాటోగ్రఫి గురించి

ఇక సాంకేతిక అంశాల్లో గొప్పగా చెప్పుకోవాల్సి వస్తే.. సినిమాటోగ్రఫి తప్పక ప్రస్తావించాలి. మాధీ సినిమాటోగ్రఫికి ప్రధాన ఆకర్షణ. చేజింగ్ సీన్లు గానీ, యాక్షన్ సీన్లు గానీ హాలీవుడ్ ప్రమాణాలకు అనుగుణంగా తెరకెక్కించారు. ఫారిన్ లోకేషన్లు అద్భుతంగా, అందంగా చిత్రీకరించాడు. కెన్నీ బేట్స్ యాక్షన్ కోరియోగ్రఫి తెర మీద ఓ మ్యాజిక్‌లా కనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకుడికి యాక్షన్ ఎపిసోడ్స్ కొత్త అనుభూతిని కలిగిస్తాయి.

ప్రొడక్షన్ వ్యాల్యూస్

టాలీవుడ్ టెక్నికల్ విజన్, బ్రిల్లియెన్స్ చాటి చెప్పేలా యూవీ క్రియేషన్స్ సాహోను రూపొందించింది. జయపజయాలను పక్కన పెడితే తెలుగు సినిమా స్థాయిని పెంచే టెక్నికల్‌ మూవీగా తీర్చిదిద్దేందుకు చేసిన ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. కథపై కాస్త జాగ్రత్త పడి ఉంటే తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు ఛాన్స్ దొరికేది. ఏదిఏమైనా ప్రభాస్‌ను జాతీయ స్థాయిలో సూపర్ హీరోగా పరిచయం చేసే చేసిన మరో ప్రయత్నం అని చెప్పవచ్చు.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

భారతీయ సినిమా తెరపై ఇప్పటి వరకు చూడని సరికొత్త, హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సాహో. టాలీవుడ్, బాలీవుడ్ స్థాయిని మించి అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిన చిత్రం సాహో. ప్రభాస్ హై ఓల్టేజ్ ఫెర్ఫార్మెన్స్, శ్రద్ధాకపూర్ గ్లామర్, ఫెర్ఫార్మెన్స్, డైరెక్టర్ సుజిత్ టేకింగ్ సినిమాకు ప్లస్ పాయింట్స్. కథ లేకుండా కథనంపైనే ఆధారపడటం సినిమాకు ఉన్న ఏకైక బలహీనత. ఏది ఏమైనా సాహో వెండితెరపైన ఓ సూపర్ హీరో చిత్రం. దిగువ తరగతి ప్రేక్షకులకు నచ్చితే ఈ సినిమా కమర్షియల్‌గా కూడా భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉంది.

పాజిటివ్, నెగిటివ్ పాయింట్స్

పాజిటివ్, నెగిటివ్ పాయింట్స్

బలం, బలహీనత

ప్రభాస్ ఫెర్ఫార్మెన్స్

శ్రద్దాకపూర్ గ్లామర్, యాక్టింగ్

సుజిత్ టేకింగ్

ప్రొడక్షన్ వ్యాల్యూస్

సినిమాటోగ్రఫి

యాక్షన్ ఎలిమెంట్స్

మైనస్ పాయింట్స్

కథ

పలు ట్విస్టులు

తెర ముందు, తెర వెనుక

తెర ముందు, తెర వెనుక

నటీనటులు: ప్రభాస్, శ్రద్దాకపూర్, మందిరా బేడి, జాక్వలైన్ ఫెర్నాండేజ్, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మహేష్ మంజ్రేకర్, చంకీ పాండే, అరుణ్ విజయ్, మురళీ శర్మ, ఎవ్లీన్ శర్మ, టిన్ను ఆనంద్,వెన్నెల కిషోర్ తదితరులు

దర్శకత్వం: సుజిత్ రెడ్డి

నిర్మాతలు: వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, భూషణ్ కుమార్

మ్యూజిక్: జిబ్రాన్, గురు రాంధావా, బాద్షా, శంకర్, ఎహ్‌సాన్, లాయ్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జిబ్రాన్

సినిమాటోగ్రఫి: మాధీ

ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్

ప్రొడక్షన్ డిజైన్: సాబు సిరిల్

బ్యానర్: యూవీ క్రియేషన్స్

నిడివి: 170 నిమిషాలు

బడ్జెట్: 350 crores

రిలీజ్: 2019-08-30

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here