Shasta Graha Kutami 2020 : షష్ట గ్రహ కూటమి వల్లే కరోనా వంటి మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉందట…!


షష్ట గ్రహ కూటమి అంటే…

ప్రస్తుత శార్వరి నామ సంవత్సరంలో చాలా మంది ఇప్పటికే షష్ట గ్రహ కూటమి గురించి ఎన్నో విషయాలను వినే ఉంటారు. అసలు ఇంతకీ అది ఏంటంటే.. ఒకే రాశిలో ఆరు గ్రహాలు చేరే దానిని షష్ట గ్రహ కూటమి అంటారు. ధనస్సు రాశిలో సూర్యుడు, బుధుడు, చంద్రుడు, గురుడు, శని, కేతువు వంటి ఆరు గ్రహాలు చేరిపోతాయట.

దుష్ఫలితాలు దానివల్లే..

దుష్ఫలితాలు దానివల్లే..

షష్ట గ్రహ కూటమి ప్రభావం వల్లే కరోనా వంటి దుష్ఫలితాలు ప్రారంభం అయ్యాయని, ఆ గ్రహ కూటమి ఎప్పుడైతే ఏర్పడిందో.. అప్పుడు కరోనా వైరస్ అనే మహమ్మారి చైనాలో పుట్టిందని, దాని పుట్టుక, వ్యాప్తి క్రమాన్ని జాగ్రత్తగా గమనించాలని కూడా చెబుతున్నారు.

దాదాపు 100 రోజులు..

దాదాపు 100 రోజులు..

మరి కొందరు జ్యోతిష్య పండితులు ఇలా చెబుతున్నారు. ఈ కూటమి ప్రభావం వల్ల దాదాపు 100 నుండి 110 రోజుల వరకు చైనా ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పు వాటిల్లబోతుందని, ఇదంతా ఏప్రిల్ రెండో వారానికల్లా సర్దుకుపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.

మకరరాశిలో కుజుడు..

మకరరాశిలో కుజుడు..

”ఈ తెలుగు నూతన సంవత్సరంలోని మార్చి నెలలో 30వ తేదీ నుండి మే మాసం 4వ తేదీ వరకు మకరరాశిలో కుజుడు, శని మరియు గురువు సంచరిస్తారు. ఇలా మకరరాశిలో ఒకేసారి మూడు గ్రహాలు సంచరించడం అనేది 793 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అది ఈ సంవత్సరమే జరుగుతోంది. మన పురాణాలలో, గ్రంథాలలో ఈ కలయికను బ్రహ్మహత్యా పాతకదోషంగా వర్ణించారు‘‘ అని పండితులు చెబుతున్నారు.

36 రోజుల పాటు..

36 రోజుల పాటు..

దీని వల్ల దాదాపు 36 రోజుల పాటు ముఖ్యంగా ఆర్థిక రంగంలో, కార్పొరేట్, ప్రైవేట్ కంపెనీలు, బ్యాంకులు, క్రీడా రంగంతో పాటు అనేక రంగాల్లో నష్టాలు ఏర్పడటమే కాకుండా ప్రక్రుతి వైపరీత్యాలు కూడా జరిగే అవకాశం ఉందట. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంటుందట. ఒక దేశానికో లేదా ఒక ప్రాంతానికో దీని ప్రభావం ఉంటుందని అనుమానించాల్సిన అవసరం లేదట.

మే 18 వరకూ

మే 18 వరకూ

ఈ షష్ట గ్రహ కూటమి ప్రభావం మే 18వ తేదీ వరకు తీవ్రంగానే ఉంటుందని ఇంకొందరు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఏప్రిల్ 14 నుండి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.

మూడు దశల్లో..

మూడు దశల్లో..

అయితే కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం మొత్తం మూడు దశల్లో ఉంటుందట. ఈ కరోనా ఉపద్రవం మనకు శాశ్వతంగా దూరం కావాలంటే 2022 మార్చి మాసం వరకు నిరీక్షించక తప్పదని పండితులు చెబుతున్నారు.

అదే ఆశిద్దాం...

అదే ఆశిద్దాం…

ఎంతమంది జ్యోతిష్యులు, పండితులు ఏమి చెప్పినా.. ఎన్ని కారణాలు చెప్పినా.. వాటి పరిణామాలు ఎలా ఉన్నా కూడా మరో రెండు నెలల్లో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గిపోతుందని ఆశిద్దాం.. అలాంటిదే జరగాలని కోరుకుందాం…

READ:   శనివారం మీ రాశిఫలాలు (18-01-2020)



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *