మహిళ టాప్ దొంగిలింపబడినది, కానీ పట్టుబడిపోయింది | She Stole XXXXL Size Top And Got Arrested When She Went To Exchange

Spread the love

ఈ సంఘటన చైనాలో జరిగింది

53 ఏళ్ల వయసు ఉన్న ఈ మహిళ అత్యంత తెలివిగా దొంగతనం చేసింది. ఈవిడ, మంగోలియాలో రద్దీగా ఉండే ఒక బట్టల స్టాండ్ నుంచి ‘ XXXXL’ పరిమాణం ఉన్న ఎరుపు రంగు టాప్ ను దొంగిలించిందని స్పష్టంగా వెల్లడైంది.

తనకు సరిపడలేదని ఎక్స్చేంజ్ కోరుతూ తిరిగి దుకాణానికి వచ్చింది ...

 

తనకు సరిపడలేదని ఎక్స్చేంజ్ కోరుతూ తిరిగి దుకాణానికి వచ్చింది …

పేరు తెలియని ఈ దొంగ, తాను దొంగతనం చేసిన ఆ టాప్ పరిమాణం చాలా పెద్దదిగా గ్రహించి, తనకు తగిన పరిమాణం కోసం, ఎక్స్చేంజ్ చేసుకునేందుకు కొన్ని నిమిషాల తరువాత దుకాణానికి తిరిగి వెళ్ళింది.

కానీ ఒక సర్ప్రైజ్ ఎదుర్కొంది …

ఈ మహిళ ఎక్స్చేంజ్ నిమిత్తం యజమాని దగ్గరకు వెళ్ళినప్పుడు, అతను ఉదయం నుండి ఏ కస్టమర్ కు కూడా దానిని విక్రయించలేదని వెల్లడించాడు. క్రమంగా అది దొంగతనానికి గురైనట్లుగా గ్రహించి, వెంటనే పోలీసులకు కబురు పెట్టాడు.

ఆగ్రహావేశానికి లోనైన ఆ మహిళ ఆ యజమానిని చెంపపై కొట్టింది…

 

ఆగ్రహావేశానికి లోనైన ఆ మహిళ ఆ యజమానిని చెంపపై కొట్టింది…

ఆమె దొరికిపోయిందని గమనించిన ఆ మహిళ ఆగ్రహావేశానికి లోనై, యజమానిని రెండుసార్లు చెంపదెబ్బ కొట్టింది. కానీ పోలీసులు ఆ మహిళను అరెస్టు చేశారు. ఆమెను ప్రశ్నించినప్పుడు, కనీసం ఆలోచన చేయకుండా, అదే రోజు ఎక్స్చేంజ్ కోసం దుకాణానికి తిరిగి వచ్చి ఉండకూడదని చెప్పింది. ఈ సమాధానానికి అవాక్కవడం పోలీసుల వంతైంది.

Also READ:   డాగ్ డివార్మింగ్ మెడిసిన్ తో టర్మినల్ క్యాన్సర్ ను నయం చేసుకున్న వ్యక్తి | He Claims He Cured His Terminal Cancer By Eating Dog Deworming Medicine

చేసింది తప్పే అయినా, తప్పును ఇలా చేసి ఉంటే బాగుండేది అని సెలవిస్తున్న ఈ ఆ మహిళ వైఖరి ఆశ్చర్యానికి గురిచేస్తుంది కదా. మీకేమనిపిస్తుంది ? మీ ఆలోచనలను క్రింద వ్యాఖ్యల విభాగంలో పంచుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర విషయాలతో పాటు. ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి.

Also READ:   భర్త యొక్క అవెంజర్స్ టాయ్ కలెక్షన్స్ ను అమ్మడానికి ప్రయత్నించిన భార్య | Wife Tries To Sell Husband’s Avenger’s Toy Collection

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *