మలబద్దకం నిరోధించుట కొరకు సులభ యోగాలు

Spread the love

మలబద్దకం నిరోధించుట కొరకు సులభ యోగాలు  –

×××××××××××××××××××××××

ఈ మధ్యకాలం లో చాలా మంది ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే మలవిసర్జన కు వెళ్తున్నాం మాకు మలబద్దకం లేదు అని అనుకుంటున్నారు . కాని అది సరియయినది కాదు . ఆరోగ్యవంతమైన మానవుడు రోజుకి రెండు సార్లు మలవిసర్జన చేయవలెను అని ఆయుర్వేద గ్రంథాలలో స్పష్టంగా ఉంది.
మలబద్దకం అనేది మానవ శరీరంలో వ్యాధులు ప్రారంభం అవుటకు మొదటి మెట్టు . మలబద్దకం ప్రారంభం అయిన వెంటనే గ్యాస్ సమస్య కూడా మొదలు అవుతుంది. కావున మలబద్ధకం అనే సమస్యని వీలైనంత తొందరగా పరిష్కరించుకోవలెను .
మలబద్దకం అనే సమస్య పరిష్కరించుకొనుటకు కొన్ని సులభయోగాలు మీకు తెలియచేస్తాను .
యోగాలు  –
*  మిరియాలను నూరి చూర్ణం చేసి అరటిపండుతో అద్దుకొని భుజిస్తే మలబద్దకం తగ్గును. చిటికెడు మిరియాల చూర్ణం చాలు .
*  తెల్ల తెగడ ఆయుర్వేద షాపుల్లో దొరకును . దానిని పాలల్లో ఉడికించి ఎండబెట్టి చూర్ణం చేసి అణా ఎత్తు చూర్ణాన్ని అనుదినం సేవిస్తున్న యెడల మలబద్దకం పోతుంది .
*  మాచిపత్ర ఆకుల కషాయం తాగుతున్న మలబద్దకం నివారణ అగును.
*  సీతాఫలం వేరు నూరి ఆ రసాన్ని తీసి తాగిన సుఖవిరేచనం అగును.
*  కాకరకాయ కూర భోజనంలో కొంచంగా తింటూ ఉంటే సుఖవిరేచనం అవుతుంది.
*  ఎండిన ఎర్ర రేగిపళ్ళు గాని , వాటి వడియాలు గాని తింటూ ఉంటే సుఖవిరేచనం అగును.
*  ప్రతిపూటా కొంచం చింతపండు తింటూ ఉన్నా సుఖవిరేచనం అగును. ఎక్కువ తినినచో విరేచనాలు అగును. అందుకే మలబద్దకం లేకుండా ఉండుటకు రోజూ చాలా మంది భోజనంతో చింతపండు చారు కప్పుడు తాగుతారు.
*  బాగుగా మిగుల పండిన అరటిపండ్లు మూడు అరటిపండ్లు తినినచో సుఖవిరేచనం అగును. పచ్చి అరటిపండు తింటే విరేచనాలు తగ్గును.
*  నాగజెముడు , ఆకుజెముడు , బొంతజెముడు వీటిలో ఏ రకమైన జెముడు రసం పది చుక్కలు తీసుకుంటే విరేచనాలు అవుతాయి . అయిదు చుక్కల మోతాదు సరిపోతుంది.
*  ఇంగువ కుంకుడు గింజ అంత లొపలికి తీసుకున్నచో కడుపులో ఉన్న మలం అంతా బయటకి వెళ్లి కడుపు శుభ్రం అగును.
*  సునాముఖి చూర్ణం ఒక చెంచా మోతాదు నిద్రకు ఉపక్రమించబోయే సమయాన ఒక గ్లాస్ గొరువెచ్చటి నీటిలో కలిపి తీసుకున్నచో ఉదయానికి సుఖవిరేచనం అయ్యి వ్యర్థాలు బయటకి వెళ్లును.
గమనిక  –
మీ ఆహరం యొక్క అరుగుదల , మీ యొక్క మోషన్ సిస్టం సక్రమంగా ఉంచుకున్నచో మీకు అనారోగ్య సమస్యలు అంతతొందరగా దరిచేరవు .

Also READ:   The Awakening Course by Dr. Joe Vitale

Updated: March 13, 2019 — 1:56 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *