బాలయ్య సినిమా కోసం బోల్డ్ బ్యూటీకి భారీ రెమ్యూనరేషన్.. ఆ సన్నివేశాలు ఉండడం వల్లేనట | Sonal Chauhan Receiving Massive Remuneration For Balakrishna Movie

‘జై సింహా’ వంటి హిట్ సినిమాను అందించిన కేఎస్ రవికుమార్‌తో నందమూరి బాలకృష్ణ మరోసారి జట్టుకట్టారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఎప్పుడో పూర్తయ్యాయి. కానీ, సినిమా రెగ్యూలర్ షూటింగ్ మాత్రం వెంటనే ప్రారంభం కాలేదు.

బాలయ్య ఎన్నికల్లో బిజీగా ఉండడం.. స్క్రిప్టు విషయంలో జరిగిన మార్పులు తదితర కారణాల వల్ల సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఆలస్యం అయింది. ఈ మధ్యనే థాయ్‌లాండ్‌లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ షురూ అయింది. ఈ భారీ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సినిమాలోని నటీనటులందరూ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు.

READ:   తమ్ముడి భార్య పక్కలోకి రానందుకు అన్న ఎంత దారుణం చేశాడంటే - All Time Report

ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తున్నారు. అలాగే, భూమిక చావ్లా, ప్రకాశ్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి ఎన్నో వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. దీంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు.

 

 

Sonal Chauhan Receiving Massive Remuneration For Balakrishna Movie

బాలయ్యతో ‘లెజెండ్’, ‘డిక్టేటర్’ చిత్రాల్లో నటించి ఇప్పుడు మూడోసారి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సోనాల్ చౌహాన్.. ఈ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకోబోతుందని ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. గతంలో తీసుకున్న మొత్తం కంటే రెట్టింపు అమౌంట్‌ను ఇందులో అందుకుంటుందట. దీనికి కారణం ఈ సినిమాలో ఆమె అందాల ఆరబోత ఎక్కువగా ఉంటుందని టాక్. చాలా సన్నివేశాల్లో ఆమె బికినీ వేసుకునే కనిపిస్తుందని అంటున్నారు. అందుకే చిత్ర యూనిట్ ఇంత సాహసం చేసిందని టాక్.

READ:   బాలయ్య బాబు దసరా ధమాకా.. ప్లాన్ భలే ఉందే..! నందమూరి ఫాన్స్‌కి గ్రేట్ ఆఫర్ | Nandamuri Balakrishna' s Dussehra gift for His Fans

ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అలాగే, ఈ సినిమాకు ‘రూలర్’ లేదా ‘క్రాంతి’ అనే టైటిల్ పెట్టబోతున్నారని కూడా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

Originally posted 2019-08-19 19:21:28.