స్పైసీ వెజిటబుల్ టోస్ట్

0
102

స్పైసీ వెజిటబుల్ టోస్ట్:
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ స్లైసులు – 4
బంగాళదుంపలు – 4 (మరీ మెత్తగా కాకుండా ఉడికించాలి)
ఉల్లితరుగు – పావు కప్పు
క్యాప్సికమ్ తరుగు – పావు కప్పు
టొమాటో తరుగు – పావు కప్పు
కారం – అర టీ స్పూను
చాట్‌మసాలా – అర టీ స్పూను
ఉప్పు – తగినంత
అల్లంతురుము – టేబుల్ స్పూను
పచ్చిమిర్చి తరుగు – టేబుల్ స్పూను
కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు
నూనె – వేయించడానికి తగినంత

Also READ:   టమోటో రైస్ రిసిపి

Please View My Other Sites

తయారుచేసే పద్ధతి:
ఉడికించిన బంగాళదుంపలను ఒక పాత్రలో వేసి, మెత్తగా చేయాలి.
మిగిలిన కూరముక్కలు, మసాలా దినుసులు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి
మరోమారు కలపాలి.
ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని గు్రండంగా, దీర్ఘచతురస్రంగా లేదా చతురస్రంగా ఒక్కో స్లైసుని నాలుగు ముక్కలు గా కట్ చేసుకోవాలి.
తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని బ్రెడ్‌కి రెండువైపులా ఉంచి చేతితో గట్టిగా అదమాలి.
నాన్‌స్టిక్ పాన్‌ను స్టౌ మీద ఉంచి వేడి చేసి, నూనె వేసి కాగాక, బ్రెడ్ స్లైస్ వేసి రెండువైపులా కాల్చాలి.

Also READ:   వెజిటబుల్ రైస్