శ్రీశైలం శ్రీమల్లికార్జునుడు

శ్రీశైలం శ్రీమల్లికార్జునుడు………..!!

శ్రీశైలం..కర్నూలు జిల్లా లో వున్నది ..
ఇక్కడ మల్లికార్జునుడు స్వామి వారు ,,
భ్రమరాంభిక శక్తీ పిఠము – భ్రమరాంభిక గా వెలిసింది.
ఈ కార్తిక మాసములో ఈ క్షేత్రమును దర్శించండి తరించండి
శ్రీశైలానికి నాలుగు ద్వారాలు వున్నాయి..అవి..

నాలుగు ద్వారాలు — క్షేత్రాలు.

1) తూర్పు ద్వారం…త్రిపురాంతకం.
శ్రీశైల మహాక్షేత్రానికి తూర్పున వున్నా ద్వారం
త్రిపురాంతక క్షేత్రం .
తారకాసురుడిని చంపింది ఈ కొండ పైనే కావడం తో
దీన్ని కుమారగిరి అంటారు .
ఈ గిరి పైన స్వామి(శివుడు ) వారు త్రిపురాంతకేశ్వరుడుగా భక్తులకు దర్శనమిస్తారు .
ఈ క్షేత్రములో శక్తీ శ్వరూపిణి జగదాంబ త్రిపుర సుందరి గా కొలువై వున్నారు …
ఈ క్షేత్రానికి ఉత్తరానా పూలకొండ వుంది ,
ఇక్కడ తారకాసురుడు , మహా విష్ణువు పూజించిన శివలింగములు వున్నాయి ,
మరియు తామర తీర్ధం , జాహ్నవి తిర్దాలు ఇక్కడ కనిపిస్థాయి .
త్రిపురాంతకం క్షేత్రం నుంచి కాశికి , శ్రీశైలానికి సొరంగ మార్గము వున్నది అని చెబుతారు .
త్రిపురాంతకం క్షేత్రము శ్రీశైలానికి 92 k.m దూరములో వున్నది.
ప్రపంచములోనే ఈ క్షేత్రములో శ్రీచక్రము పైనే దేవాలయము ప్రతిష్టించబడినది

READ:   అహోబిళం

2) దక్షిణ ద్వారము – సిద్ధవటం :
శ్రీశైల క్షేత్రానికి సిద్ధివటం దక్షిణ ద్వారము గా వ్యవహరిస్తారు .
శ్రీశైల క్షేత్ర ద్వారాలలో సువిశాలమైన ద్వారము .
సిద్దివటము
సిద్దులకు ప్రదానమైన కేంద్రము .
పెన్నా నది ఒడ్డున వున్నా ఈ క్షేత్రము కాశికి సమానమైనా క్షేత్రము గా ప్రసిద్ధి చెందింది .
ఈ నదిలో స్నానము చేసి సిద్దేశ్వరుని దర్శిస్తే విముక్తి లబిస్తుంది .
ఈ క్షేత్రము కడప జిల్లా నుంచి తిరుపతికి వెళ్ళే మార్గ మద్యలో వున్నది

3) పశ్చిమ ద్వారము అలంపుర క్షేత్రము :
జోగులాంబ దేవి మహా శక్తీ పీఠము
అలంపుర క్షేత్రము 18 శక్తీ పిఠములలో ఒకటి
ఈ జోగులాంబ దేవి .
గంభీర రూపములో వున్నా ఈ అమ్మవారిని పక్కనుండి నమస్కరించాలి .
ఈ క్షేత్రము మహబూబ్ నగర్ జిల్లా తుంగభద్ర నదీ తీరములో వుంది .

4) ఉత్తర ద్వారం – ఉమామహేశ్వరం :
ఈ క్షేత్రము లో స్వామి ( శివుడు ) మహేశ్వరుడు గా కొలువు దీరి వున్నాడు ..
క్షేత్రనాథుడైన ఉమామహేశ్వరుడు స్వయం భూలింగము .
ఇక్కడ వున్నా రుద్ర దారము లో స్నానము ఆచరించి మహేశ్వరుణ్ణి దర్శిస్తే మరు జన్మ ఉండదు అనీ భక్తుల నమ్మకము .
ఇక్కడ ఒక రాత్రి నిదురిస్తే కాశి , ప్రయాగాది పుణ్యక్షేత్రాలలో లక్షల సంవత్సరాలు నివసించినంత
ఫలం లభిస్తుంది .
శివరాత్రి పర్వదినాన సకల దేవతాగణలు ఇక్కడికి వస్తాయి .
ఈ క్షేత్రము లో రుద్ర ధారా , విష్ణు ధారా , బ్రహ్మ ధారా , అనే మూడు తీర్థాలు వున్నాయి .
ఇక్కడ పట్టెడు అన్నము దానము చేస్తే .. అన్నదానము లేక్కలేనింత ఫలితము వొస్తుంది ..
హైదరాబాద్ వెళ్ళే మార్గము లో మన్నూరు , రంగ పురము వద్ద 3 k.m లు నడిచి ఉమామహేశ్వరాని చేరుకోవొచ్చు ..

READ:   పంచభూతలింగాలు

శ్రీశైలంలో..
శిఖర దర్శనము :
శ్రీశైలము . నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరములో తూర్పు వైపున దోర్నాల మార్గములో శిఖర దర్శనము చేసుకోవొచ్చు .

సాక్షి గణపతి :
శివ పార్వతుల దర్శనము అనతరము ( తరువాత ) భక్తులు సాక్షి గణపతి ఆలయము వద్దకు తప్పనిసరిగా వెళతారు.
పార్వతి పరమేశ్వరులను దర్సించుకున్నట్లు ఇక్కడ వారి తనయుడు ( వినాయకుడు ) సాక్షి అయి నమోదు చేసుకుంటాడు .

పాలధార – పంచదార :
ఇక్కడ ఆదిశంకర చార్యులు తపస్సు చేసిన ప్రాంతమిది , ఆలయానికి 4 k.m దూరములో సాక్షి గణపతి ఆలయము దాటాక దర్సనమిస్తున్ది .
146 మెట్లు దిగాలి . పాలధార – పంచదారకి

READ:   నరసింహస్వామి ఆలయం (ఖమ్మం)

పాతాళ గంగ :
శ్రీశైలానికి 3 k.m దూరములో వుంటుంది .
దాదాపు 900 మెట్లు దిగి వెళ్లి పాతాళ గంగ లో స్నానము చేయడము విశేష పుణ్య ఫలము.
ఇక్కడ తమ పిత్రు దేవతలకు తర్పణము వదులుతారు .

విభూతి కుండం :
వీరశంకరాలయానికి ముందుభాగము లో
కాస్త దూరములో ఒక నీటి కుండ వుంది .
దీనినే విభూతి కుండ అని కూడ అంటారు ..
ఈ కుండలో స్నానము చేసిన వారికి సంపదలు కలుగుతాయి ,
అందుకే దీనిని విభూతి కుండ అంటారు
( విభూతి అంటే ఐశ్వర్యము )
ఓం నమః శివాయ..!!

లోకా సమస్తా సుఖినోభవంతు..!!

Originally posted 2018-11-19 10:18:08.