అమెరికాలో ప్రముఖ టాలీవుడ్ కమెడియన్‌పై దాడి? | Tollywood star telugu comedian attacked by USA Telugu people?

Spread the love

‘తానా’ సభల్లో పాల్గొన్న అనంతరం సదరు కమెడియన్‌కు నిర్వాహకులు సన్మానం చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అమెరికాలోని మరో తెలుగు సంస్థ సదరు కమెడియన్‌కు తమ ఆర్గనైజేషన్ తరుపున సన్మానం చేసేందుకు తీసుకెళ్లారట. సన్మానం అనంతరం ఏర్పాటు చేసిన పార్టీలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

దాడికి గల కారణం ఏమిటి?

 

దాడికి గల కారణం ఏమిటి?

దాడికి గల కారణం ఏమిటనే విషయం ఆరా తీస్తే షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. తాగిన మత్తులో సదరు కమెడియన్…. అక్కడ ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, దీంతో పెద్ద గొడవ జరిగిందని, ఈ క్రమంలోనే ఆ మహిళకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్ దాడి చేసినట్లుగా చర్చించుకుంటున్నారు.

పోలీసులకు కంప్లయింట్ చేద్దామనుకున్నారు కానీ…

సదరు కమెడియన్ ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు మహిళకు చెందిన కుటుంబ సభ్యులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారని, అదే జరిగితే సదరు కమెడియన్ ఇబ్బందుల్లో పడటంతో పాటు అతడికి అక్కడికి తీసుకొచ్చిన సంస్థకు కూడా చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశ్యంతో…. విషయం అంతదూరం వెళ్లకుండా ఆపారట.

కమెడియన్ గురించి టాలీవుడ్లో హాట్ టాపిక్

 

కమెడియన్ గురించి టాలీవుడ్లో హాట్ టాపిక్

ఇలాంటి విషయాలు మనుషుల కంటే వేగంగా దేశాలు దాటుతాయి. సదరు కమెడియన్ అమెరికా నుంచి ఇండియా వచ్చే లోపే తెలుగు సినిమా పరిశ్రమలో ఈ విషయం స్ప్రెడ్ అయింది. అయితే అతడో స్టార్ కమెడియన్ కావడంతో అతడి పేరు బహిరంగంగా మాట్లాడటానికి, చెప్పడానికి ఎవరూ సాహసించడం లేదు.

Also READ:   ఇవి కాపీ చేస్కుని భద్రపరుచుకోండి .. మీకు కావాల్సిన వాటిపైన క్లిక్ చేస్తే సమాచారం క్షణాల్లో ఓపెన్ అవుతుంది 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *