Video: టిక్‌టాక్‌లో డేంజరస్ ఛాలెంజ్… క్షణాల్లో ప్రాణం పోతుంది జాగ్రత్త– News18 Telugu

Advertisement


TikTok: టిక్‌టాక్‌లో డేంజరస్ ఛాలెంజ్… క్షణాల్లో ప్రాణం పోతుంది జాగ్రత్త
(image: Youtube)

టిక్‌టాక్… ఈ వీడియో క్రియేటింగ్ యాప్ గురించి తెలియని యువతీయువకులు ఉండరు. భారతదేశంలో టిక్‌టాక్ యూజర్ల సంఖ్య కోట్లల్లో ఉంది. ఫన్నీ వీడియోస్ క్రియేట్ చేయడానికి, షేర్ చేయడానికి యువత ఉపయోగించే ఈ యాప్‌లో కొన్ని డేంజరస్ ట్రెండ్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడూ ఏదో ఒక ఛాలెంజ్ ట్రెండింగ్‌లో ఉండటం మామూలే. ఆ మధ్య కీకీ ఛాలెంజ్ ఎంతలా వైరల్ అయిందో తెలిసిందే. ఈ ఛాలెంజ్ స్వీకరించి డ్యాన్స్ చేసినవారిలో చాలామంది కాళ్లు విరగ్గొట్టుకున్నారు. గాయాలపాలయ్యారు. ఇప్పుడు అలాంటి డేంజరస్ ఛాలెంజ్ మరొకటి టిక్‌టాక్‌లో మొదలైంది. ఈ ఛాలెంజ్ ఇంకా ఇండియాకు రాలేదు కానీ… విదేశాల్లో మాత్రం ఏకంగా ప్రాణాలు తీసేస్తున్న డేంజరస్ ఛాలెంజ్ ఇది. ఈ ఛాలెంజ్ పేరు ‘ట్రిప్పింగ్ జంప్’. ఈ ఛాలెంజ్‌లో ముగ్గురు వ్యక్తులు ఉంటారు. మధ్యలో వ్యక్తికి అసలు ఏం జరుగుతుందో తెలియదు. కుడివైపు, ఎడమవైపు ఉన్నవారు మధ్యలో ఉన్న వ్యక్తిని జంప్ చేయమని అడుగుతారు. ఏం జరుగుతుందో తెలియని మధ్యలో వ్యక్తి జంప్ చేయగానే, మిగతా ఇద్దరు వ్యక్తులు కాళ్లను తంతారు. అంతే… మధ్యలో వ్యక్తి బ్యాలెన్స్ కోల్పోయి వెనక్కి పడిపోతాడు. తల నేరుగా నేలకు గట్టిగా తాకుతుంది. అంతే… క్షణాల్లో ప్రాణం గాల్లో కలిసిపోతుంది.
READ:   6 Soda Gadgets Put to the Test

క్షణాల్లో ప్రాణాలు తీసే ఈ భయంకరమైన ‘ట్రిప్పింగ్ జంప్’ ఛాలెంజ్ ఇప్పుడిప్పుడే వైరల్‌గా మారింది. అంతేకాదు… పలువురు ప్రాణాలు కోల్పోయారన్న వార్తలొస్తున్నాయి. ఈ ఛాలెంజ్ చేసినందుకు ఫ్లోరిడా హైస్కూల్‌లో చదివే ఇద్దరు విద్యార్థులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియోలు వాట్సప్‌లో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. వెంటనే మీ పిల్లలకు ఈ డేంజరస్ ఛాలెంజ్ గురించి వివరించాలని, లేకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్న మెసేజ్‌లు వాట్సప్‌లో షేర్ అవుతున్నాయి. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీల్లో ఈ డేంజరస్ ఛాలెంజ్ వైరల్‌గా మారే అవకాశం ఉందన్న ఆందోళనలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ డేంజరస్ ఛాలెంజ్ ఎవరూ చేయొద్దని అనేక మంది హెచ్చరిస్తున్నారు. ఈ డేంజరస్ ఛాలెంజ్‌ను వ్యతిరేకిస్తూ change.org వెబ్‌సైట్‌లో కూడా పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే ఈ పిటిషన్‌పై 44,000 మంది సంతకాలు చేశారు.డేంజరస్ ‘ట్రిప్పింగ్ జంప్’ ఛాలెంజ్ ఎక్కడ మొదలైందో, ఎవరు మొదలుపెట్టారో తెలియదు. కానీ… ఈ ఛాలెంజ్ మాత్రం చాలా ప్రమాదకరమని వీడియోలు చూస్తే తెలుస్తుంది. క్షణాల్లో ప్రాణాలు తీసే ఇలాంటి ప్రమాదకరమైన ఛాలెంజ్‌లకు దూరంగా ఉండండి. ఇలాంటి ఛాలెంజ్‌ల పట్ల మీ పిల్లల్ని, స్నేహితుల్ని అప్రమత్తం చేయండి.

READ:   Xiaomi Redmi Note 5 Review | Camera, Specs, Features, Performance, and More

ఇవి కూడా చదవండి:

ఇది చదవండి


Train Ticket Cancellation: రైలు టికెట్ ఫ్రీగా క్యాన్సిల్ చేసుకోవచ్చు… ఈ యాప్‌లో ట్రై చేయండి

Online Gold: ఆన్‌లైన్‌లో బంగారు నగలు కొనొచ్చా? తెలుసుకోండిAadhaar Card: మీ పిల్లలకు ఆధార్ కార్డు ఉందా? ఈ సేవలు ఉచితం



First published: February 14, 2020